ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇంటికి వీధిపోటు ఉంటే ఎలాంటి నష్టం జరుగుతుంది. దక్షిణం వైపు ప్లాట్ అందరికి మంచే జరుగుతుందా...మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం...
ప్రశ్న: మా ఇంటికి తూర్పు వైపు వీధి ఉంది. ఆ వీధి దక్షిణం వైపు వెళ్తుంది. దక్షిణం వైపు ఎండ్ అయ్యే రోడ్డు మా ఇంటికి వీధిపోటు (కర్వ్)గా వస్తుంది? వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నాం. దీని కోసం ఏం చేయాలి.
జవాబు: సొంతింటికి వీధిపోటు ఉండటం మంచిది కాదు. దాని వల్ల చాలా సమస్యలొస్తాయి. అభివృద్ధి ఉండదు. అనారోగ్య, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంటికి దూరంగా వీధిపోటు ఉన్నా, కొంతమేర అయినా ప్రభావం పడుతుంది. అందుకని ఇంటికి ఎదురుగా వినాయకుడి బొమ్మ పెట్టుకోవడం మంచిది. దీని వల్ల కొంతైనా ప్రభావం తగ్గుతుంది. భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాస్తు ఎక్స్పర్ట్ ను కలవండి.
ప్రశ్న: నేను ప్లాట్ కొనాలనుకుంటున్నా ..అది దక్షిణం వైపు ఉంది. కొందరు దక్షిణం వైపు ప్లాటు తీసుకోవద్దు అన్నారు. దక్షిణ ముఖంగా ఉన్న స్థలం ఏ రాశివారికైనా బాగుంటుందా? ఇది ఎంత వరకు నిజం?
జవాబు: దక్షిణం దిక్కు ప్లాట్ పనికొస్తుంది. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే ఇంటి షేపులు, మెజర్ మెంట్స్ సరిగ్గా ఉండాలి. ఏమైనా డౌట్లు ఉంటే. ఇంటి ఏరియల్ వ్యూఫొటోలు తీసుకొని సరైన వాస్తు నిపుణుడ్ని సంప్రదించండి. కొన్ని వాస్తు విషయాలు డైరెక్ట్ చూస్తేనే, సరైన పరిష్కారం దొరుకుతుంది.
